Wednesday, May 15, 2024

HanuMan | సూప‌ర్ రేటింగ్.. దూసుకుపోతున్న హ‌నుమాన్..

టాలీవుడ్‌ యువ హీరో తేజ సజ్జా.. తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ హనుమాన్‌. సూపర్ హీరో సిరీస్‌గా ప్రశాంత్‌వర్మ తెరకెక్కించిన‌ హనుమాన్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇక ప్రీమియ‌ర్ షోస్ నుంచే పాజిటివ్ రివ్యూస్ తో.. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అంతే కాకుండా.. డిఫరెంట్‌ పాపులర్ ప్లాట్‌ఫామ్స్‌లో రేటింగ్‌ విషయంలో కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది హ‌నుమాన్ మూవీ.

ఐఎండీబీ ఈ సినిమాకి 9.0 రేటింగ్ ఇవ్వగా.. ప్ర‌ముఖ‌ టికెట్‌ బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షో 9.6 రేటింగ్ ఇచ్చింది. ఇక‌, పేటీఎమ్‌ 93 శాతం, గూగుల్‌ 4.9 రేటింగ్ ఇచ్చింది. ఇక ఈ మూవీని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెర‌కెక్కింది. ఈ మూవీలో కోలీవుడ్ భామ అమృతా అయ్యర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement