Saturday, May 18, 2024

Hanu-man సరికొత్త రికార్డ్.. కలెక్షన్స్‌లో తగ్గని జోరు !

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్ సినిమా అన్ని రకాల ప్రేక్షకులని మెప్పించి ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు సెట్ చేసిన హనుమాన్ సినిమా ఇప్పుడు మరో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 రోజులు దాటుతున్నా థియేటర్స్ లో హనుమాన్ సందడి చేస్తుంది.

హనుమాన్ సినిమా 25 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆల్రెడీ సంక్రాంతికి రిలీజయిన సినిమాల్లో గత 92 ఏళ్లుగా ఏ సినిమా సాధించని రికార్డ్ హనుమాన్ సినిమా సాధించింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి 300 కోట్ల కలెక్షన్స్ 25 రోజుల్లోనే అంటే ఇది పెద్ద రికార్డ్.

హనుమాన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లో కూడా దూసుకుపోతుంది. అమెరికాలో కూడా 5 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసి టాప్ 5 తెలుగు సినిమాగా నిలిచింది. ప్రస్తుతం చిత్రయూనిట్ అమెరికాలో సక్సెస్ టూర్ వేస్తున్నారు. సంక్రాంతి సినిమాలు అప్పుడే ఓటీటీ బాట పడుతుంటే హనుమాన్ మాత్రం ఇంకా థియేటర్స్ లో తన హవా చూపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement