Friday, May 3, 2024

ఆరడుగుల బుల్లెట్ వస్తున్నాడు..

సీటీమార్ తో మంచి హిట్ అందుకున్న గోపీచంద్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. సీటీమార్ మూవీ ఫస్ట్ డేనే బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత సీటీమార్ తో గోపీచంద్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపెట్టారు. ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ గా రాబోతున్నాడు. స్టార్ డైరెక్ట్ బి.గోపాల్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాలో గోపీచంద్, నయనతారా జంటగా నటించారు. ఎపుడో థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సిన ఆరడుగుల బుల్లెట్ మూవీ.. ఇప్పటికీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. మాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా రూపొందింది. సీటీమార్ తో బంపర్ హిట్ అందుకున్న గోపీ చంద్…. ఆరడుగుల బుల్లెట్ తో మరో హిట్ అందుకుంటాడని ఆయన అభిమానులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement