Saturday, April 20, 2024

చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తేజ్

నటుడిగా, రచయిత‌గా ఉత్తేజ్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి భార్య ఈ రోజు క్యాన్స‌ర్ కార‌ణంగా క‌న్నుమూసారు. కొద్ది రోజులుగా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలో మరణించారు. ఉత్తేజ్ భార్య ప‌ద్మావ‌తి మ‌ర‌ణ వార్త విని మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌కాశ్‌రాజ్, బ్ర‌హ్మాజీ, జీవిత త‌దిత‌రులు ఆసుప‌త్రికి చేరుకుని ఆయ‌న‌ని ఓదార్చారు. ఉత్తేజ్‌ను, అతడి కుమార్తెను ఓదారుస్తూ చిరు తన విచారాన్ని వ్యక్తం చేశారు.

ఉత్తేజ్‌ భార్య పద్మావతి ఆయనకు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో విధులు నిర్వర్తించేవారు. ఉత్తేజ్‌కు చెందిన వస్త్ర వ్యాపారాన్ని కూడా పద్మావతి నిర్వహించేవారు. ఉత్తేజ్ చేపట్టే పలు సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగం పంచుకునేది. ఉత్తేజ్- పద్మావతి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు వున్నారు. వారి పేర్లు చేత‌న, పాట‌. చేత‌న హీరోయిన్‌గానూ న‌టించింది. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 1989 లో తెర‌కెక్కించిన శివ సినిమా ద్వారా ఉత్తేజ్ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఆ త‌ర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ .. కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచారు. శివ, రాత్, ద్రోహి, గోవింద గోవింద చిత్రాల‌కు ఉత్తేజ్ సహాయక దర్శకుడిగా ప‌ని చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement