Sunday, April 28, 2024

Anjali : గీతాంజలి..మాకెంతో ప్రత్యేకం…

నటి అంజలి నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రం’. శివ తుర్లపాటి దర్శతక్వంలో కోన వెంకట్‌ నిర్మించారు. హారర్‌ కామెడీ జోనర్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివ తుర్లపాటి మాట్లాడుతూ -టైలర్‌ అందరికీ నచ్చే ఉంటు-ంది. సినిమా అంతకు మించి ఉంటుదన్నారు.

- Advertisement -

షకలక శంకర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ మూవీలో నాది కోనగారి క్యారెక్టర్‌. నా పేరు చెనక్కాయల శీను. ఆయనలాగానే ఈ సినిమాలో కష్టపడుతుంటాను. గీతాంజలి సినిమాతో మా అందరికీ ఓ మెట్టుఎక్కే అవకాశం దక్కింది. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్రంతో మరో మెట్టు- ఎక్కే అవకాశం దక్కింది. అన్నారు.చిత్ర సమర్పకుడు కోన వెంకట్‌ మాట్లాడుతూ గీతాంజలి మాకెంతో స్పెషల్‌ మూవీ. గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇంకా చాలా స్పెషల్‌ మూవీ.

ఆ సినిమా సక్సెస్‌ మా టీ-మ్‌ని కలిపింది. ఏప్రిల్‌ 11న మూవీని రిలీజ్‌ చేస్తున్నాం. తప్పకుండా సినిమాను అందరూ చూడాలని కోరుకుంటు-న్నాం అన్నారు. నటి అంజలి మాట్లాడుతూ గీతాంజలి మళ్ళీ వచ్చింది -టైలర్‌ చాలా బాగా వచ్చింది. సినిమా దీని కంటే వంద రెట్లు బావుంటుంది. నా 50వ సినిమా ఎంతో స్పెషల్‌ గా ఉండాలని అనుకున్నాను. ఆ కోరిక తీరింది. నా ఎం-టైర్‌ టీ-మ్‌ మనసు పెట్టి ఈ మూవీ చేశారు. కామెడీ, హారర్‌ ఎలిమెంట్స్‌ ను మిక్స్‌ చేసి చేసిన సినిమా. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌ అన్నారు. రచయిత, దర్శకుడు బి.వి.ఎస్‌.రవి. , సత్యం రాజేష్‌ , షకలక శంకర్‌, ఎడిటర్‌ ఛోటా కె.ప్రసాద్‌, సంగీత దర్శకుడు ప్రవీణ్‌ లక్కరాజు, డైరెక్టర్‌ శివ నిర్వాణ మాట్లాడుతూ, నిర్మాత డివివి.దానయ్య తదితరులు చిత్ర విజయాన్నికాంక్షిస్తూ మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement