Monday, May 6, 2024

‘గని’ కి ఏమైంది ?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కిరణ్ దర్శకత్వంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా సంబంధించి ఓ వివాదం పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాతలు అయిన అల్లు అరవింద్ తనయుడు బాబి ఆయన స్నేహితుడు సిద్ధూ కలిసి మధ్య ఆర్థికంగా కొన్ని విషయాలలో పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు కథలో కూడా పదేపదే మార్పులుచేర్పులు చేస్తుండడంతో డైరెక్టర్ కూడా తన వల్ల కాదని చేతులు ఎత్తేస్తున్నాడట. అసలు విషయం ఏంటంటే వరుణ్ తేజ్ సూచన మేరకు 50 లక్షలతో ఓ సెట్ వేశారట. కానీ అందులో షూట్ చేయకుండానే తీసేయాల్సి వచ్చిందట. ఈ విషయంలో నిర్మాతల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయని తెలుస్తోంది. కానీ డైరెక్టర్ కిరణ్ మాత్రం ఇదే విషయమై మాట్లాడుతూ.. హీరో చేతికి గాయం కావడం కరోనా కారణంగా షూట్ ఆలస్యం వల్ల సెట్ ను తీసేయాల్సి వచ్చిందని… అంతే తప్ప ఎలాంటి వివాదాలు లేవని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement