Saturday, May 4, 2024

Video | వారణాసిలో గంగాహారతి.. హాజరైన స‌న్నీలియోన్

బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న సన్నీలియోన్.. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో గంగాహారతి కార్యక్రమంలో పాల్గొంది. మాజీ ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్‌తో కలిసి వారణాసిలో పూజలు నిర్వహించింది. సన్నీలియోన్ సాంప్రదాయకంగా పింక్ సల్వార్ సూట్‌లో గంగాహారతిలో పాల్గొంది. కాగా, సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిత్యం సినిమాల‌తో బిజిగా ఉంటున్న ఆమె తాజాగా వార‌ణాసిలోని గంగాహారతికి హాజ‌రైన నేపథ్యంలో సన్నీని చూసేందుకు జనం ఎగబడ్డారు.

కాగా, ఎప్పుడూ వృత్తిపరమైన కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే సన్నీలియోన్‌కు భక్తిభావం కూడా ఎక్కువే. వీలు దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేస్తుంది సన్నీలియోన్‌. ఇక‌, 2012లో జిస్మ్ 2 చిత్రంతో భారతీయ వెండితెరపై మెరిసిన సన్నీలియోన్ తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో నటించింది. సన్నీలియోన్ ప్రస్తుతం పలు భాషల్లో చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మలయాళ డెబ్యూ మూవీ రంగీలాలో ఈ బ్యూటీ నటిస్తోంది. సన్నీలియోన్‌కి తమిళంలో రెండు, హిందీలో మూడు, కన్నడలో మూడు సినిమాలు ఉన్నాయి. సన్నీలియోన్ తెలుగులో కరెంట్ తీగ, పీఎస్వీ గరుడ వేగ, జిన్నా చిత్రాల్లో నటించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement