Monday, May 6, 2024

గేమ్ ఛేంజ‌ర్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్.. డైరెక్ట‌ర్ శంక‌ర్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న తాజా చిత్రం గేమ్ ఛేంజ‌ర్. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. కాగా ఈ మూవీ అప్ డేట్ ని అందించాడు శంక‌ర్. ఈక్రమంలో రీసెంట్ గా ప్రారంభమైన క్లైమాక్స్ షూట్ ను పూర్తి చేశామంటూ దర్శకుడు శంకర్ అప్డేట్ ఇచ్చార్. క్లైమాక్స్ అదిరిపోయిందని చెప్పారు. ఇక బుధ‌వారం నుంచి ఇండియన్ 2 షూటింగ్ జరగనుందని తెలిపారు. దీంతో ఇంకా ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తోంది. తర్వలోనే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయనున్నారు. ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ – కియారా అద్వానీ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్ షూట్ చేస్తున్నట్టు అప్టేట్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా క్లైమాక్స్ పూర్తైనట్టుగా శంకర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ క్రేజ్ కు తగ్గట్టుగా .. శంకర్ గేమ్ ఛేంజర్ ను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి నుంచి సినిమాపై అంతకంతకూ ఆసక్తి పెరుగుతూనే వస్తోంది. పాటలు, ఫైట్స్, కీలక సన్నివేశాల్లో ఏమాత్రం తగ్గకుండా బెస్ట్ అవుట్ పుట్ కోసం చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement