Thursday, May 2, 2024

ఆదిపురుష్ నుండి.. ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్

రీసెంట్ గా ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ఆదిపురుష్ టీం.. ఈ ట్రైల‌ర్ తో సినిమాపై అంచ‌నాలు పెంచేసింది. కాగా తాజాగా మరో పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసింది ఆదిపురుష్ మూవీ టీం. తాజాగా విడుదలైన పోస్టర్ లో హనుమంతుడిపై రాముడు నిల్చోని విల్లు సంధిస్తున్నారు. ఈ పోస్టర్ మరింత పవర్ ఫుల్ గా ఉంది. ఇందులో స్టార్ హీరో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీత పాత్రలో.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో మంచి విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది. ఈ చిత్రాన్ని జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలో విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement