Friday, May 3, 2024

పొన్నియన్‌ సెల్వన్‌-2కి.. సెన్సార్‌ పూర్తి

పొన్నియన్‌ సెల్వన్‌-2 మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకుంది.పొన్నియన్‌ సెల్వన్‌-2కి సెన్సార్‌ యూ/ఏ సర్టిఫికేట్‌ను జారి చేసింది. రన్‌టైమ్‌ 2 గంటల 44 నిమిషాలుగా ఉండనుంది. తొలిపార్టు కూడా దగ్గర దగ్గరగా ఇదే రన్‌టైమ్‌తో రిలీజైంది. కాగా అప్పుడు ఈ సినిమా చాలా లెంగ్తీగా ఉందని, కొన్ని సీన్లు కట్‌ చేసి ఉండాల్సిందని, ప్రేక్షకుడి సహానానికి ఇదో పరిక్ష అంటూ పలువురు కామెంట్స్‌ చేశారు.కాగా మళ్లీ ద‌ర్శ‌కుడు మ‌ణిరత్నం అంత లెంగ్తీ రన్‌టైమ్‌తో వస్తున్నాడంటే రిస్క్‌ అనే చెప్పాలి. ఈ సారి ఏదో మేజిక్‌, వండర్స్‌, చేసి కూర్చోబెట్టాల్సిందే తప్ప.. ప్రేక్షకులు అంత లెంగ్తీ టైమ్‌ ఉన్న సినిమాను చూడాలంటే ఈ మధ్య ఒకటికి పది సార్లు ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. చియాన్‌ విక్రమ్‌, కార్తి, జయంరవి, త్రిష, ఐశ్వర్యరాయ్‌ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ సినిమాను మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మ్రదాస్‌ టాకీస్‌ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement