Sunday, May 5, 2024

First Single Promo | రేపే ‘గుంటూరు కారం’ నుంచి ‘‘ధ‌మ్ మ‌సాలా’’!!

టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటినస్తున్న లేటెస్ట్ అప్ క‌మింగ్ మూవీ గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కి రెడీగా ఉంది. కాగా, ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడా అంటూ మహేష్ ఫ్యాన్స్ క‌ళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న గుంటూరు కారం ఫస్ట్‌ సింగిల్ ప్రోమో రేపు రిలీజ్ కానున్న‌ట్టు కాసేప‌టి క్రితం అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్.

ఇదిలాఉంటే.. సోషల్ మీడియాలో గుంటూరు కారం మొదటి సాంగ్ ఇదే అంటూ ఓ ఆడియో తెగ వైరల్ అవుతుంది. గుంటురు కారం సాంగ్ లీక్ అంటూ నెట్టింట రచ్చ జరుగుతోంది. అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ లీక్ అయినా సాంగ్ ను తెగ వైరల్ చేస్తున్నారు. మహేష్ బాబు నటించిన దూకుడు, ఆగడు, ‘బిజినెస్‌మేన్’ , సర్కారు వారిపాట వంటి సినిమాలకు సంగీతం అందించిన థమన్.. ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement