Monday, April 29, 2024

ఫిలింనగర్: షూటింగ్ లో దగ్ధమయిన కారు.. తప్పినముప్పు..

కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించడంతో సినిమా షూటింగ్ ల సందడి మళ్లి మొదలయింది. అయితే హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఓ షూటింగ్ స్పాట్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కారు జనరేటర్‌ నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జనరేటర్‌ నుంచి డీజిల్‌ లీక్‌ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆ జనరేటర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి పక్కన ఉన్న షాపులకు, మరో కారు ఈ మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో హొండా I20 కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇది కూడా చదవండి: కేరళ అమ్మాయి..హైదరాబాద్ అబ్బాయిలు

Advertisement

తాజా వార్తలు

Advertisement