Sunday, April 28, 2024

దర్శకులకు ఇష్టమైన పేర్లు – వారి హీరోయిన్స్ కి అవే పేర్లు

ఎంతో మంది దర్శకులు లక్ ని నమ్ముతూ ఉంటారు. అందుకే తమకు ఇష్టమైన పేర్లను, ఆ సినిమా టైటిల్ కో లేక హీరోయిన్ పేరుకో వాడుతూ ఉంటారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే దర్శక ధీరుడు రాజమౌళి సై సినిమాలో హీరోయిన్ జెనీలియా పేరు ఇందుగా పెట్టుకున్నాడు. అలాగే ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమాలో కాజల్ అగర్వాల్ పేరు ఇందు. అంతేకాదు న్యాచురల్ స్టార్ నాని హీరోగా సమంత హీరోయిన్ గా వచ్చిన ఈగ సినిమాలో సమంత పేరు బిందు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి సినిమాలో భూమిక పేరు ఇందు.

అలాగే విక్రమ్ కే కుమార్ మనం, గ్యాంగ్ లీడర్, హలొ,24 చిత్రాల్లో హీరోయిన్ కు ప్రియా అనే పేరును పెట్టుకున్నాడు. అలాగే వివి వినాయక్ ఆది, దిల్, ఠాగూర్, సాంబ, లక్ష్మి, యోగి, అదుర్స్ సినిమాలో హీరోయిన్ కు నందిని అనే పేరును వాడుతూ ఉంటాడు.

మరో డైరెక్టర్ శ్రీను వైట్ల ఢీ, నమో వేంకటేశ, రెడీ సినిమాల్లో హీరోయిన్ కు పూజ అనే పేరును వాడుతూ ఉంటాడు. అయితే ఈ డైరెక్టర్స్ ఈ పేరును ఎందుకు అంత పర్టీక్లర్ గా వాడుతుంటారనే విషయం పై మాత్రం ఎవ్వరూ ఎక్కడా నోరు మెదపలేదు. కాబట్టి ఆ విషయం వారికే తెలియాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement