Sunday, April 28, 2024

Faria : ఫారియా అబ్దుల్లాలోన‌రేష్ రొమాన్స్ …

అల్లరి నరేష్ కామెడీ సినిమాలతోనే ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇక ఆ తరువాత మెల్లగా ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ నటుడిగా మరిన్ని షేడ్స్ చూపించాడు. ముఖ్యంగా నాంది సినిమా అతనికి మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. ఉగ్రం సినిమాలో కూడా నరేష్ కొత్తగా కనిపించాడు.

ఇక సీరియస్ సినిమాల అనంతరం అల్లరి నరేష్ మళ్ళీ తన కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు. నూతన దర్శకుడు మల్లి అంకంతో చేస్తున్న చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఇక నరేష్ కు జోడిగా జాతిరత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. తాజాగా, ఫస్ట్ సింగిల్ ‘ఓహ్ మేడమ్‌’ను విడుదల చేశారు. సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ పాటను లాంచ్ చేశారు. ఈ లిరికల్ వీడియోలో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లాల ఇద్దరు కూడా అద్భుతమైన కెమిస్ట్రీతో ఆకట్టుకునే విధంగా ఉన్నారు. అల్లరి నరేష్ ఆమెతో సరసాలాడుతుండగా, ఆమె అతని సహవాసాన్ని ఆనందిస్తుంది.

- Advertisement -

విజువల్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. చూస్తుంటే ఈ ఇద్దరు బిగ్ స్క్రీన్ పై వారి అల్లరి ప్రేమతో మ్యాజిక్ క్రియేట్ చేసేలా ఉన్నారు. ఇక సినిమాలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, మరియు అరియానా గ్లోరీ ఇతర పాత్రలలో కనిపించబోతున్నారు. మేకర్స్ ముందుగా చెప్పినట్లుగానే ఆ ఒక్కటి అడక్కు సినిమాను మార్చి 22 థియేట్రికల్ గా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement