Wednesday, May 1, 2024

9 ఇయర్స్ @ రామ్ చరణ్,ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెళ్లి రోజు నేడు. ఈ సందర్భంగా చరణ్ భార్య ఉపాసన తమ వివాహ బంధానికి తొమ్మిదేళ్లు అంటూ ట్వీట్ చేసింది. అంతేకాకుండాఓ ఫోటోని కూడా పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో చరణ్-ఉపాసనలు స్టైలిష్ లుక్ లో కనిపించారు. అలాగే మెగా అభిమానులు సోషల్ మీడియాలో #9yearsoframcharanupasana అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇక రామ్ చరణ్ ఉపసన లు 2012 జూన్ 14న వివాహం చేసుకున్నారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన ఎప్పటికప్పుడు రామ్ చరణ్ సినిమాలకు సంబంధించి విషయాలను అలాగే ఫ్యామిలీ పిక్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement