Thursday, April 25, 2024

పుష్ప ఓ భారీ యాక్షన్ మూవీ: ఫహద్ ఫాజిల్

మలయాళీ స్టార్ ఫహద్‌ ఫాజిల్ పుష్ప మూవీ పై స్పందించాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ తెలుగులో పుష్ప మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు ఫహద్‌. తన పాత్ర గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు ఫహద్. దర్శకుడు సుకుమార్‌ చెప్పిన స్ర్కిప్టు నాకు చాలా బాగా నచ్చింది. ఈ భారీ యాక్షన్‌ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర వైవిధ్యంగా ఉండబోతుంది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి విభిన్న పాత్ర పోషించలేదని తెలిపారు. రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ గతంలో తెరకెక్కించిన చిత్రం రంగస్థలం తనని ఎంతగానో మెప్పించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement