Sunday, April 11, 2021

ఏపీలో ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్

ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లలో ఉన్నవారికి ఓటు వేసే హక్కును అధికారులు కల్పిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఉద్రిక్తతల నడుమ పోలింగ్‌ను అధికారులు నిర్వహించారు. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగియగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రంలో 47.42 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం-46.64 శాతం , గుంటూరు-37.65 శాతం , ప్రకాశం-34.19 శాతం , నెల్లూరు-41.87 శాతం , విశాఖ-55.29 శాతం , కడప-43.87 శాతం , చిత్తూరు-50.39 శాతం , అనంతపురం-46.69 శాతం , కర్నూలు-48.4 శాతం, విజయనగరం-56.57 శాతం , తూ.గో-51.64 శాతం , ప.గో-54.3 శాతం , కృష్ణా-49 శాతాల వారీగా నమోదైంది. కాగా హైకోర్టు తీర్పు అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News