Thursday, April 25, 2024

“దసరా”కి హైదరాబాద్‌లో అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్..

నేచురల్ స్టార్ నాని మొదటి పాన్-ఇండియన్ మూవీ దసరా. ఈ సినిమాతో మంచి ప్రభావం చూపాలని ఆశిస్తున్నాడు నాని. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలో మూవీ టీమ్ ఫుల్ బిజీగా ఉంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, సిినిమాకి హైదరాబాద్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సింగిల్-స్క్రీన్ సినిమాస్, మల్టీప్లెక్స్‌లలో బుకింగ్‌లు ఓపన్ అయ్యాయి. చాలా షోలు ఇప్పటికే సేల్ అయ్యి హౌస్ ఫుల్ అయ్యాయి. సుధాకర్ చెరుకూరి ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మించారు.

ఇందులో దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని, జరీనా వాహబ్. సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. మార్చి 30, 2023న దసరా సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement