Saturday, May 4, 2024

ఎనిమి టీజర్ ఎప్పుడో తెలుసా ?

తమిళ స్టార్ హీరో విశాల్ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. విశాల్ ప్రస్తుతం ఎనిమి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విశాల్ తో పాటు ఆర్య, ప్రకాష్ రాజ్, మృణాళిని రవి, మమతా మోహన్ దాస్ ప్రధానపాత్రలో నటించారు. ఇందులో ఆర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా ఆనంద్ శంకర్ రచన, దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మొదట ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం జూన్ 20న ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం. ఇంకా ఈ ఏడాదిలోనే ఎనిమి, విశాల్ 31 సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement