Saturday, May 4, 2024

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో.. ప్ర‌ముఖ నిర్మాత క‌న్నుమూత‌

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు ప్ర‌ముఖ నిర్మాత ఎస్ ఎస్ చ‌క్ర‌వ‌ర్తి. ఆయ‌న వ‌య‌సు 53సంవ‌త్స‌రాలు. శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. చక్రవర్తి మరణంతో సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు. చక్రవర్తికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆయన తనయుడు జానీ రేణిగుంట అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చక్రవర్తి తమిళంలో అనేక చిత్రాలు నిర్మించారు. అభిరుచి కలిగిన నిర్మాతగా గుర్తింపు పొందారు. ఆయ‌న చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తిన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స జరుగుతున్నప్పటికీ చక్రవర్తి హెల్త్ మెరుగుపడలేదు. పరిస్థితి విషమించడంతో చక్రవర్తి శనివారం మరణించారు. 90వ దశకం నుంచే తమిళ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. అయితే ఆయన 1997లో ‘రాశి’ అనే చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ చిత్రంలో అజిత్, రంభ జంటగా నటించారు. ఆ తర్వాత వరుసగా అజిత్ తోనే పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించారు. అప్పట్లో అజిత్, చక్రవర్తి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదని టాక్. వాలి, సిటిజెన్, రెడ్, మగవారే, ఆంజనేయ చక్రవర్తి అజిత్ తో నిర్మించారు. అజిత్ తర్వాత చక్రవర్తి ఎక్కువగా చిత్రాలు చేసింది స్టార్ హీరో శింబుతో. వీళ్లిద్దరి కాంబోలో కాలై, వాలు లాంటి చిత్రాలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement