Friday, May 3, 2024

EAGLE లేటెస్ట్ అప్‌డేట్‌.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

మాస్ మ‌హ‌రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ఈగల్‌ పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వస్తొంది. కాగా, తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ అప్డేట్ అందించారు మేకర్. ఈగల్‌ ట్రైలర్‌ను డిసెంబర్ 20న సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈగల్‌లో కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. రవితేజ దీంతోపాటు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో RT4GM (వర్కింగ్‌ టైటిల్‌)తో సినిమా చేస్తుండగా..మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement