Wednesday, December 6, 2023

మొదలైన ద‌స‌రా బాక్సాఫీస్ సంద‌డి.. రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!

దసరా నవరాత్రులు ప్రారంభం కావడానికి నెల ఉంది. అయితే… దసరా బాక్సాఫీస్ సందడి ఆల్రెడీ మొదలైంది. ప‌లు సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు రెడీ అవుతున్నాయి. విజయ దశమికి థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమాల్లో ముఖ్యంగా… అనిల్ రావిపూడి దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ‘భగవంత్ కేసరి’ ఒకటి అయితే… మాస్ మహారాజ రవితేజ హీరోగా వ‌స్తున్న‌ పాన్ ఇండియన్ మూవీ ‘టైగర్ నాగేశ్వర రావు’ మరొకటి. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల అవ‌నుంద‌డ‌గా.. అక్టోబర్ 20న రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ విడుదలవుతోంది.

అయితే, బాలయ్య సినిమాతో పాటు అక్టోబర్ 19న తమిళ స్టార్ విజయ్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ సైతం తమ తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వర రావుస సినిమాల‌కు ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ‘లియో’, ‘ఘోస్ట్’ సినిమాల నుంచి పోటీ ఉండొచ్చు. హిందీ హీరో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ జంటగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘గణపథ్’. ఈ సినిమా కూడా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, మలయాళ నటుడు రెహమాన్, ఎలీ అవరం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement