Wednesday, December 11, 2024

New Delhi – చంద్ర‌బాబు అరెస్ట్ – ప‌లు జాతీయ పార్టీల ఖండ‌న

న్యూఢిల్లీ – స్కిల్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు ప‌క్షాన టీడీపీ చేస్తున్న న్యాయ‌పోరాటానికి త‌మ మ‌ద్దతు ఉంటుంద‌ని వివిధ జాతీయ పార్టీల నేత‌లు ప్రక‌టించారు. ఢిల్లీలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్‌ను బుధ‌వారం హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, బిఎస్పీ ఎంపీలు కున్వార్ డ్యానిష్ ఆలీ, రితేష్ పాండే ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ అంతిమంగా న్యాయ‌మే గెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు. టీడీపీ చేస్తున్న ధ‌ర్మ పోరాటానికి త‌మ సంపూర్ణ మ‌ద్దతు ఉంటుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలతో టీడీపీ రూపొందించిన బుక్‌లెట్‌ను జాతీయ పార్టీ నేత‌ల‌కి లోకేశ్ అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement