Monday, December 11, 2023

Latest | డన్కీ లేటెస్ట్ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

బాలీవుడ్ స్టార్ యాక్టర్‌‌ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కతున్న మూవీ డన్కీ. ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో వరుసుగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్‌లు సొంతం చేసుకున్నాడు. ఇక దీంతో, యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ డన్కీ పై షారుఖ్ అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక తాజాగా, ఈ మూవీ నుండి ‘‘లుట్ పుట్ గయా’’ అనే ఫస్ట్ సాంగ్ ని రేపు విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు మేకర్స్. దాంతో మూవీ రిలీజ్ డేట్ పై కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అందించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ డిసెంబర్ 21న విడుదల కానున్నట్టు రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. కాగా ఈ మూవీని రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్, జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement