Friday, April 26, 2024

దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా పోస్టర్ వచ్చేసింది

దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఓకే బంగారం, మహానటి వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మన్ననలు పొందాడు దుల్కర్. కాగా ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన న్యూ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాకు టైటిల్ మాత్రం ఇప్పటివరకు పిక్స్ చేయలేదు. శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన చిన్న వీడియో క్లిప్ బట్టి సినిమాలో దుల్కర్ సల్మాన్ రామ్ అనే పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతుంది.

అలాగే మద్రాస్ మిలిటరీ లిటిరేట్ అధికారిగా దుల్కర్ ప్రేమ కోసం ఎలా పోరాడాడు అని నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మిస్తున్నారు. అలాగే విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement