Monday, April 29, 2024

బాలయ్య ,గోపీచంద్ సినిమా హీరోయిన్ ఎవరో తెలుసా ?

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ కూడా పూర్తి అయింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాలకృష్ణ గోపిచంద్ తో సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో మొదట లక్ష్మీరాయ్ తో ఓ ఐటమ్ సాంగ్ చేయించాలని దర్శకుడు గోపీచంద్ భావించాడట. కానీ ఆమెనే ఇప్పడు మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ లక్ష్మీరాయ్ తో గతంలో అధినాయకుడు సినిమాలో నటించింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement