Monday, May 6, 2024

సర్కారు వారి పాటలో అర్జున్ పాత్ర ఏంటో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ త్వరలోనే రీస్టార్ట్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో విలన్ గా అర్జున్ నటించబోతున్నారని మొదటి నుంచి కూడా టాక్ వచ్చింది. అయితే అర్జున్ రోల్ కి సంబంధించి ఓ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ చిత్రంలో అర్జున్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడట. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అర్జున్ చేస్తున్న మోసాలను మహేష్ బాబు బయటపెట్టే పని లో ఉంటాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఎక్కడా రాకపోయినప్పటికీ ఇదే నిజమని టాక్ నడుస్తోంది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement