Saturday, April 27, 2024

మేజర్ హిందీ శాటిలైట్ రైట్స్ ఎంతో తెలుసా ?

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు హీరోగా నటిస్తున్నాడు. అలాగే శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజు, రేవతి, మురళి శర్మ, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అలాగే శాటిలైట్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ శాటిలైట్ రైట్స్ పది కోట్ల రూపాయలు పలికినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement