Friday, May 17, 2024

ఒక్క పాటకు సిద్ శ్రీరామ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలుసా ?

ఇటీవల కాలంలో సిద్ శ్రీరామ్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రతి సినిమాలో కూడా ఓ పాటను పాడించేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇటీవలకాలంలో సిద్ శ్రీరామ్ పాడిన నీలినీలి ఆకాశం, ఒకే ఒక లోకం నువ్వు, ఏమైపోయావే అంటూ సాగిన పాటలు విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాయి. సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సిద్ శ్రీరామ్ పాట మాత్రం సంచలనాలను సృష్టిస్తోంది.

ఇక గతంలో అలా వైకుంఠపురం లో ని సామజవరగమనా పాట అయితే మరో లెవెల్ అనే చెప్పాలి. అయితే ఇంత క్రేజ్ వున్న సిద్ శ్రీరామ్ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా సింగర్ ని బట్టి ఒక పాటకు 20 వేల నుంచి 50 వేలు మహా అయితే లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇస్తారట. కానీ శ్రీరామ్ కు ఉన్న మార్కెట్ ను బట్టి ఆయన ఒక పాటకు 4.5 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సిద్ శ్రీరామ్ కు ఉన్న డిమాండ్ ను బట్టి ఆయన అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వక తప్పడంలేదట దర్శక నిర్మాతలకు.

Advertisement

తాజా వార్తలు

Advertisement