Thursday, May 2, 2024

పుష్ప…కొత్తగా ఉంటుంది – దేవిశ్రీప్రసాద్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా బన్నీ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి దేవిశ్రీప్రసాద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రతి సినిమాలో కొత్తదనం కోరుకునే సుకుమార్ ఈ సినిమాలో మరింత జాగ్రత్త తీసుకున్నారట. సినిమా వేరే స్థాయిలో ఉంటుందని దేవిశ్రీప్రసాద్ అన్నారు. ఈ సినిమాతో సుకుమార్ కథ చెప్పే విధానం ఎంతో గొప్పగా మారుతుందని… సినిమా పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ అని అన్నారు. ఇక బన్నీ అయితే తనను తాను పూర్తిగా పాత్రకోసం మార్చుకున్నారని అన్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement