Monday, April 29, 2024

దేవ‌ర‌లో.. హైలెట్ గా అండ‌ర్ వాట‌ర్ ఫైట్ సీన్

దేవ‌ర యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు కొరటాల శివ‌. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెడతాయట. అలాగే ఈ మూవీలో ఓ అండర్ వాటర్ ఫైట్ సీన్ ఉంటుందట. ఇందుకోసం సముద్రాన్ని తలపించే ఓ పెద్ద ట్యాంకర్ ను తెప్పించి షూట్ చేస్తున్నారట. ఈ సినిమాలో ఈ యాక్షన్ సీన్ హైలెట్ కానుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి..యాక్ష‌న్ కి పెట్టింది పేరు ఎన్టీఆర్.ఆయ‌న న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నే లేదు. కాగా ఈ చిత్రంలో మొద‌టిసారిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవర మూవీ షూటింగ్ నుంచి లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement