Monday, April 29, 2024

Devara : రెండు షెడ్యూల్స్ పూర్తి.. ఇంట్రెస్టింగ్ అప్ డేట్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం దేవ‌ర.అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. మూవీ గురించి ఓ అప్ డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగు దశలో ఉంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో విల‌న్ గా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. మూడో షెడ్యూల్ షూటింగుకి టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో జాలరుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా జాన్వీ కపూర్ కనిపించనుందనే టాక్ వచ్చింది. కానీ ఆమె పాత్ర విలన్ ఫ్యామిలీ నేపథ్యానికి లింకై ఉంటుందనే విషయం తాజాగా బయటికి వచ్చింది. ఆమె పాత్రకి సంబంధించిన ఒక ట్విస్ట్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తూ చివరివరకూ లాక్ చేసి ఉంచుతుందని చెబుతున్నారు. ప్రధానమైన కథతో పాటు ఆమె పాత్రకి సంబంధించిన సస్పెన్స్ కూడా కొనసాగుతూ ఉంటుందని అంటున్నారు. ఆ ట్విస్ట్ ను ఎవరూ గెస్ చేయలేరనీ .. రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ షాక్ అవుతారని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement