Sunday, May 5, 2024

సంక్షోభంలో రక్షకులు కొడతారు…కార్తికేయ2 న్యూ పోస్టర్

హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ 2 సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ కొత్త పోస్టర్ లో నిఖిల్ ఎంతో గంభీరంగా కనిపిస్తున్నారు. సంక్షోభంలో రక్షకులు పుడతారు అంటూ ఈ పోస్టర్ పై చిత్ర యూనిట్ ట్యాగ్ లైన్ ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. అలాగే మరోవైపు నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్ ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నేడు నిఖిల్ 36 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement