Thursday, May 9, 2024

హిందీలో అదరగొట్టిన డియర్ కామ్రేడ్ !!

విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా 2019 జూలై 26న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే తెలుగులో ఈ సినిమాను తీసినప్పటికీ ఒకేసారి తమిళ ,కన్నడ ,మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. అప్పట్లో కొన్ని కారణాలవల్ల హిందీ వెర్షన్ లో మాత్రం రిలీజ్ కాలేదు. కాగా 2020 జనవరి 19న హిందీ డబ్బింగ్ వెర్షన్ ను యూ ట్యూబ్ లో పోస్ట్ చేశారు.

అయితే తాజాగా ఈ చిత్రం 250 మిలియన్లకు పైగా వ్యూస్ ను దక్కించుకుంది. అంతేకాకుండా 2.9 మిలియన్స్ లైక్స్ ని కూడా సాధించింది. ఈ మేర చిత్రయూనిట్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement