Thursday, May 16, 2024

సాయి పల్లవితో వార్నర్ డాన్స్…వీడియో వైరల్

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొన్నటి వరకు క్రికెట్ అభిమానులకు మాత్రమే వార్నర్ గురించి తెలుసు… కానీ ఇటీవల కాలంలో తెలుగు సినీ ప్రేక్షకులందరికీ దగ్గర అయ్యాడు డేవిడ్ వార్నర్. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ ఇలా అన్ని భాషల సినీ అభిమానుల లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురము లో సినిమాలోని బుట్ట బొమ్మ పాటకు తనదైన శైలిలో అదిరిపోయే స్టెప్స్ వేసి ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత రకరకాల తెలుగు పాటలకు డ్యాన్సులు చేస్తూ ఫేస్ యాప్ ద్వారా తెలుగు హీరోలను ఇమిటేట్ చేస్తూ వచ్చాడు. ఇక తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ సాయి పల్లవి జంటగా నటించిన మారి2 సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ డాన్స్ చేశాడు వార్నర్. ఫేస్ యాప్ ద్వారా వార్నర్ ఈ వీడియో ను ఎడిట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CPDPuXKlC27/?utm_medium=copy_link
Advertisement

తాజా వార్తలు

Advertisement