Thursday, May 9, 2024

నా కెరీర్ లో బెస్ట్ సాంగ్ – నానీ

నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘దసరా’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కీర్తి సురేష్‌ నానికి జోడి గా నటించింది.
ఇటివలే విడుదలైన దసరా టీ-జర్‌ ఆకట్టుకుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోంది. తాజాగా ‘దసరా’ సెకం డ్‌ సింగిల్‌ ”ఓరి వారి… ” పాటని విడుదల చేశారు. సంతోష్‌ నారాయణ్‌ ఈ పాటని కంపోజ్‌ చేశారు. శ్రీమణి అందించిన సాహిత్యం పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.


పాట విడుదల వేడుకలో నాని మాట్లాడుతూ ”దసరాలో నాకు చాలా ఇష్టమైన పాట ‘ఓరి వారి… ‘. నా పర్సనల్‌ ఫిలాసఫీకి దగ్గరగా వున్న పాట ఇది. ఒక సారి అమ్మాయి మనది కాదన్న తర్వాత కాసేపు బాధపడాలి ఇలాంటి పాటలు వినాలి. ఇంటికెళ్ళి అవ్వ ఒడిలో దూరి చం టి బిడ్డల పడుకోవాలి.(నవ్వుతూ). అదే ఈ పాట సాహిత్యం. శ్రీమణి చాలా అద్భుతం గా రాశారు. సంతోష్‌ నారాయణ్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. విజువల్‌ గా ఈ పాట నా కెరీర్‌ లో బెస్ట్‌ సాంగ్‌. మర్చి 30న స్క్రీన్‌ మీద చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతారు. వినే కొద్ది నచ్చే పాటిది. నెలలు తరబడి నా చెవిలో మ్రోగుతూనే వుంది. అన్నారు.
శ్రీకాంత్‌ ఓదెల మాట్లాడుతూ ”దసరా రూటేడ్‌ గా, సహజంగా వుండే కథ. మా వూర్లో జరిగిన కొన్ని పాత్రల నుంచి తీసుకొని రాసుకున్న డ్రామా. నాని గారు చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు” అన్నారు . ఈ చిత్రానికి సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫర్‌ గా పని చేస్తున్నారు. దసరా చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement