Sunday, April 28, 2024

మాణిక్ రావు థాక్రేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్ థాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ భేటీ జరిగింది. నిన్న కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ పై థాక్రే వివరణ తీసుకోనున్నట్టు తెలుస్తోంది.అంతకుముందు కోమటిరెడ్డి, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను థాక్రే క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని భారత్ జోడో యాత్రలో భాగంగా వరంగల్ లో పాదయాత్ర చేస్తుండగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే పొత్తు విషయాలను ఎందుకు మాట్లాడారనే దానిపై తాజాగా కోమటిరెడ్డి నుంచి థాక్రే వివరణ కోరనున్నట్టు సమాచారం. కోమటిరెడ్డి వ్యాఖ్యల అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ థాక్రేపై ఒత్తిడి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement