Wednesday, November 13, 2024

డ్యాన్స్ అద‌ర‌గొట్టిన.. డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి

హీరో బాల‌కృష్ణ‌తో ఓ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి. ఈయ‌న డైరెక్ట‌రే కాదండోయ్..మంచి డ్యాన్సర్ కూడా. గతంలోనే కొన్ని సార్లు ఈ విషయం రుజువు అయింది. తాజాగా మరోసారి బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హాజరైన ఓ వేడుకలో ఆయన స్టెప్ ను అనుకరించి చూపించిన తీరుకు అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మరోసారి తన డ్యాన్సింగ్ టాలెంట్ చూపించాడు అనిల్. ప్రస్తుతం ఈయన నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్ లోనే అతను ఫైట్ డ్యాన్స్ మాస్టర్లతో కలిసి బాలయ్య బాబు పాటకు స్టెప్పులేశారు. బాలయ్యా బాలయ్యా అంటూ సాగే ఈ పాటకు ఫైర్ మాస్టర్ ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపించారు. మధ్యలో డ్యాన్స్ మాస్టర్ కూడా జాయినయ్యాడు అని చెబుతూ అనిల్ వాళ్లతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. డ్యాన్సర్ గా మారిన డైరెక్టర్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కుర్ర హీరోలా కనిపిస్తున్నారంటూ కొంత మంది చెబుతుండగా.. చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement