Thursday, May 2, 2024

మాస్త్రో ట్రైలర్ కి అదిరిపోయే రియాక్షన్

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్ట్రో. బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీ అందధూన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
కాగా మాస్ట్రో లో నభా నటేష్, అలాగే తమన్నా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం ట్రైలర్ ఆగస్ట్ 23 వ తేదీన సాయంత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రం ట్రైలర్ కి ప్రేక్షకులు, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ ట్రైలర్ ఇప్పటి వరకూ సోషల్ మీడియా లో 3 మిలియన్ కి పైగా వ్యూస్ ను సాధించింది. కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో నితిన్ పాత్ర సినిమా కే హైలెట్ గా నిల్వనున్నట్టు అర్థం అవుతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ట్రైలర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కి సంగీతం మహతి స్వర సాగర్ అందిస్తున్న సంగతి తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement