Thursday, April 25, 2024

Court Case: అక్రమ సంబంధం అంటగట్టారు.. యాక్షన్‌ తీసుకోండి.. సమంత కేసులో తీర్పు నేడే

సినీ నటి సమంత పిటిషన్‌పై కూకట్‌పల్లి కోర్టులో సోమవారం మరోసారి వాదనలు జరిగాయి. సమంత ప్రతిష్టను దెబ్బ తీసిన మూడు యూ ట్యూబ్‌ చానళ్ళపై చర్యలు తీసుకోవాలని సమంత తరఫు న్యాయవాది బాలాజీ కోర్టును కోరారు. అనేక అవార్డులు, రివార్డులు తీసుకున్న సమంత ప్రతిష్టలు దెబ్బతీసేలా అవి వ్యవహరించాయన్నారు.

ట్విట్టర్‌ వేదికగా విడిపోతున్నట్లు తెలిపిన వెంటనే సోషల్‌మీడియాలో సమంతపై విపరీతమైన ట్రోల్‌ చేశారన్నారు. సమంత ఇంకా విడాకులు తీసుకోలేదని, ఈలోగా ఆమెపై దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమన్నారు. సమంతను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి వార్తలు ప్రసారం చేశారన్నారు.

ఆమెకు అక్రమ సంబంధాలను అంటగట్టారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సమంత తన పిటిషన్‌లో ఎక్కడా డబ్బులు అడగలేదన్నారు. యూట్యూబ్‌ లింకులు మాత్రమే తొలగించాలని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా భవిష్యత్‌లో ఇలాంటి వార్తలు ప్రసారం చేయకుండా పర్మినెంట్‌ ఇంజెంక్షన్‌ ఇవ్వాలని న్యాయవాది బాలాజీ కోరారు. గతంలో శిల్పాశెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజెంక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. న్యాయవాది వాదనలను విన్న కోర్టు తీర్పును మంగళవారం వెల్లడించనున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement