Monday, April 29, 2024

ఆచార్య రిలీజ్ పై ఇంకా రాని క్లారిటీ

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అలాగే చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా….రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కాగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తుండగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.

సోలో డేట్ కోసం ఆచార్య టీం మొత్తం ఎదురుచూస్తోంది. మొదట దసరాకి రిలీజ్ చేద్దాం అనుకున్నారు… కానీ అప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉంది..ఆ తరువాత క్రిస్మస్ కు బన్నీ పుష్ప ఉంది. అందుకే ఆచార్య ను సోలో గా రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తున్నారట దర్శకనిర్మాతలు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement