Thursday, May 2, 2024

పెగాసస్ వ్యవహారంపై సుప్రీం విచారణ

పెగాసస్​ వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరపనుంది. పెగాసస్ దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరగాలని కోరుతూ దాఖలైన పలు పటిషన్లపై సుప్రీంకోర్టు.. విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్‌వీ రమణ, జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ అనిరుద్ధ బోస్​లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణను కొనసాగించనుంది. పెగసస్​ వివాదంపై విచారణ కోరుతూ కేంద్రానికి నోటీసు జారీ చేయాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

కాగా, ప్రముఖ జర్నలిస్టు ఎన్‌.రామ్‌, శశికుమార్‌, న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై ఆగస్టు 10న విచారణ జరిపిన ధర్మాసనం.. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే సమాంతరంగా సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరగడం దురదృష్టకరం అని పేర్కొంది. కోర్టులు జరిపే విచారణలపై విశ్వాసం, నమ్మకం ఉండాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement