Thursday, May 2, 2024

ద‌స‌రా’పై లేని క్లారిటీ.. కొత్త డేట్ కోసం ట్రై చేస్తున్న మేక‌ర్స్..

నేను లోకల్’ తరువాత నాని-కీర్తి సురేశ్ కలిసి నటిస్తున్న సినిమా ద‌స‌రా.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కొంతవ‌ర‌కు షూటింగు కూడా జరిగింది. అయితే ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో ఎంతో గంభీరంగా క‌నిపించాడు నాని ఇంత మాస్ లుక్ తో నాని చేయడం ఇదే ఫస్టు టైమ్.

అయితే టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమాను ‘దసరా’కి రిలీజ్ చేయాలనుకున్నారు మేక‌ర్స్. కానీ అది జ‌రిగేలా క‌నిపించ‌డంలేదు. రిలీజ్ డేట్ పై మూవీ మేక‌ర్స్ మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. షూటింగ్ లో జాప్యమే ఇందుకు కార‌ణ‌మ‌న్న‌ట్టు తెలుస్తోంది. అనుకున్నట్టుగా ఈ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకోకపోవడం వలన రిలీజ్ డేట్ సంబంధించి ఆలోచన చేస్తున్నట్టు స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేక‌ర్స్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement