Friday, April 26, 2024

సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ పై క్లారిటీ ఎప్పుడు ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందనగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆ ఫస్ట్ లుక్ వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు నాడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement