Thursday, May 2, 2024

Viral | చిరు లీక్స్.. త‌మ్ముడి పాట‌కు స్టెప్పేసిన‌ ‘భోళా శంకర్‌’

వాల్తేరు వీరయ్య లాంటి మంచి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్‌’ మూవీ షూటింగ్‌ పూర్తయిపోయింది. ప్ర‌స్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి, కీర్తి సురేశ్‌ డబ్బింగ్‌ పూర్తి చేశారు. తాజాగా బ్రహ్మానందం డబ్బింగ్‌ పూర్తి చేశారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ‘చిరు లీక్స్ ‘ పేరుతో అభిమానులతో పంచుకున్నారు. సినిమాలో చిరంజీవి.. ప‌వ‌ణ్ క‌ళ్యీన్ పాటకు స్టెప్ వేయ‌డానికి సంబంధించిన షాట్ ఒక్క‌టి లీక్.. ఇంకేముంది మెగా ఫ్యాన్సుకు పండుగే.. వెంటనే దానిని వైరల్ చేయడం కూడా మొదలైంది. ఇక‌ ఇటీవల విడుదల చేసిన ‘జాం జాం జాం జజ్జనక’ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాంబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ మూవీ ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

https://twitter.com/tonygaaaadu/status/1680600900904300550
Advertisement

తాజా వార్తలు

Advertisement