Tuesday, April 30, 2024

మరో రీమేక్ సినిమాలో చిరంజీవి..!

చిత్ర పరిశ్రమ దాదాపు రెండేళ్ళు కరోనా కారణంగా కుదేలైంది. చిత్ర నిర్మాణం స్థంభించింది. విడుదలలు ఆగిపోయాయి. కొద్ది రోజుల తర్వాత మళ్లి మామూలు పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. పరిశ్రమకు జరిగిన నష్టం కొంతమేర అయినా పూడ్చేందుకు అన్నట్టు హీరోలు ఎక్కువ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరికి స్ఫూర్తిదాయకంగా సీనియర్‌ హీరోలు నిలుస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ జోరుమీదున్నారు. ఆయన సోదరుడు పవన్‌ సైతం ఇదేబాటలో ఉన్నారు. చిరంజీవి ఇప్పటికే ఆచార్య సినిమా పూర్తిచేసి ఉన్నారు. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో రామ్‌చరణ్‌ మరో హీరో. ప్రస్తుతం చిరంజీవి గాడ్‌ఫాదర్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఇంకా భోళాశంకర్‌ చిత్రీకరణ సైతం చేశారు. ఇంకా వెంకీ కుడుముల దర్శకత్వంలో కొత్త చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇది లా ఉంటే చిరంజీవి మళయాలంలో ఆదరణ పొందిన బ్రో డాడీ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. ఇది వినోదాత్మక కథతో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలనే ఆలోచన చిరుకు ఉన్నట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement