Saturday, May 4, 2024

ఈనెల 14 నుంచి ఓటీటీలో నితిన్ ‘చెక్’

హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. ఇటీవల రంగే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. అయితే ఇందులో రంగ్ దే మంచి విజయం సాధించినప్పటికీ… చెక్ సినిమా మాత్రం నిరాశపరిచింది. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదలైంది. మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీ ఆదిత్య పాత్రలో నితిన్ ఈ సినిమాలో కనిపించారు. జైలు శిక్ష సమయంలో చెస్ ఆడిన ఒక అమెరికన్ ఖైదీ కథ ఇది అని ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం అని దర్శకుడు చెప్పారు.

ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్రలో కనిపించగా ప్రియా ప్రకాష్ వారియర్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయబోతున్నారు. మే 14 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక థియేటర్ లో ఫెయిల్ అయిన ఈ చిత్రం ఓటిటి లో అయినా సక్సెస్ ని అందుకుంటుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement