Thursday, April 25, 2024

దేశంలో తగ్గుతున్న కరోనా కొత్త కేసులు… పెరుగుతున్న మరణాలు..

దేశంలో కరోనా కేసులు కొంచం తగ్గుతున్నాయి. నిన్న మొన్నటితో పొల్చితే కేసులు సంఖ్య తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అయితే కొవిడ్ మరణాలు మాత్రం పెరిగాయి. వ‌రుస‌గా మూడో రోజూ క‌రోనా యాక్టివ్‌ కేసుల్లో త‌గ్గుద‌ల క‌నిపించ‌గా, మ‌ర‌ణాలు మాత్రం మ‌రోమారు నాలుగు వేలు దాటాయి. మొన్నటి వరకు వరుసగా నాలుగు లక్షలపై చిలుకు కేసులు నమోదు కాగా… ప్రస్తుతం ఆ సంఖ్య మూడున్నర లక్షలకు పడిపోయింది. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూలు అమలు చేయడంతో కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మార్చి మొద‌టి వారం త‌ర్వాత పెరుగుతూ రికార్డు స్థాయికి చేరిన రోజువారీ కేసులు.. క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. దేశంలో నిన్న‌ కొత్త‌గా 3,48,421 మందికి కరోనా నిర్ధారణ అయింది. గడచిన 24 గంట‌ల సమయంలో 4,205 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఒకేరోజు ఇంత భారీ సంఖ్యలో క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టిసారి.

గ‌త శుక్రవారం(మే7) అత్యధికంగా 4,185 మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు దానికంటే 20 మంది అధికంగా మృతిచెందారు. దీంతో గ‌త 14 రోజుల్లో 50 వేల మంది క‌రోనాతో క‌న్నుమూశారు. సగటున రోజుకు 3,528 మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా మ‌ర‌ణాల‌తో మొత్తం మృతులు మృతుల సంఖ్య 2,54,197కు పెరిగింది. 

అత్యధిక కేసులు నమోదవుతున్న మ‌హారాష్ట్రలో మ‌రోమారు మ‌ర‌ణాలు పెరిగాయి. గ‌త రెండు రోజులుగా 600 కంటే త‌క్కువ‌గా న‌మోద‌వుతుండ‌గా, ఇప్పుడ‌ది 793కు చేరింది. త‌మిళ‌నాడులో 241 నుంచి 298కి పెరిగాయి. ఇలా దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజువారీ మ‌ర‌ణాలు అధిక‌మ‌య్యాయి. మొద‌టి నుంచి అత్యధిక కేసులు న‌మోద‌వుతున్న మ‌హారాష్ట్రలో రోజువారీ కేసులు తగ్గుతుండ‌గా… కేర‌ళ‌, కర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌, పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఈటల అనుచరులపై గంగుల ఫోకస్!

Advertisement

తాజా వార్తలు

Advertisement