Tuesday, May 7, 2024

న్యూడ్ ఫొటో షూట్‌పై కేసు న‌మోదు.. ర‌ణ్‌వీర్‌ని ప్ర‌శ్నించ‌నున్న ముంబై పోలీసులు

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. పేపర్ మ్యాగజైన్ కోసం న్యూడ్‌గా ఫొటోలకు ఫొజులిచ్చాడు. ఆ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే రణ్‌వీర్ ఫొటో షూట్‌పై మహిళల మనోభావాలను కించపరిచాడంటూ ఓ స్వచ్ఛంద చెంబూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు సెక్షన్ 292, సెక్షన్ 293, సెక్షన్ 509, ఇన్పర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్ 67ఏ కింద అతడిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.

ర‌ణ్‌వీర్ ఫొటోషూట్‌ఫై పోలీసులు అతడిని ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో సమన్లు అందజేశారు. ఆగస్టు 22న దర్యాప్తునకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. తమకు సహకరించాలని కోరారు. బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం ఫొటో‌షూట్ విషయంలో రణ్‌వీర్‌కు అండగా నిలిచింది. బీ టౌన్ అందాల భామలు ఆలియా భట్, జాన్వీ కపూర్, విద్యా బాలన్ అతడిని వెనకేసుక్కొచ్చారు. హాలీవుడ్ నటుడు బర్ట్ రేనాల్డ్స్ ను స్ఫూర్తిగా తీసుకుని రణ్‌వీర్ ఈ ఫొటో షూట్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement