Saturday, May 4, 2024

Priyanka : బాల రామ‌య్య స‌న్నిధిలో బుల్లి ప్రియాంక‌

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బుధవారం అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ కోసం ఇటీవల ఇండియా వచ్చిన ఈ జంట అయోధ్యకు వచ్చారు. సంప్రదాయ చీరలో ప్రియాంక, కుర్తా పైజామా ధరించి నిక్ జోనస్ ఆలయానికి చేరుకున్నారు.

రామయ్య దర్శనం, పూజల తర్వాత ఆలయ పూజారుల నుంచి తీర్థప్రసాదాలు అందుకున్నారు. పూజారుల ఆశీస్సులు తీసుకున్నాక వారితో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. అయోధ్య ఎయిర్ పోర్ట్ లో దిగాక రెండేళ్ల వయసున్న తన కూతురు మాల్టీతో ప్రియాంక ‘అయోధ్య’ అని పలికించడం విశేషం..

Advertisement

తాజా వార్తలు

Advertisement